ఇక ఫోన్లలో ఇది తప్పనిసరి


  • లాక్​డౌన్​ తర్వాత దేశంలో కొత్త ఫోన్లలో 
  • ఆరోగ్య సేతు యాప్​ ఉండాల్సిందే..
  • ఇప్పటికే 7.5 కోట్ల మంది డౌన్‌లోడ్
  • త్వరలో అధికారికంగా కేంద్రం నిబంధన


     లాక్​డౌన్​ తర్వాత అమ్మే ప్రతీ స్మార్ట్​ఫోన్​లో ఆరోగ్య సేతు యాప్​ ఉండాల్సిందేనని నిబంధనను కేంద్రం త్వరలో అమలు చేయబోతుంది.  ఈ యాప్​ దేశంలో అమలు కోసం కేంద్రం త్వరలోనే కొత్త నోడల్ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేయనుంది. స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలతో ఈ ఏజెన్సీ సమన్వయం చేసుకుని, యాప్ ప్రీ ఇన్‌స్టాల్ అయ్యేలా చూసుకుంటుంది. ఇప్పటికే కరోనా నేపథ్యంలో ఆరోగ్య సేతు యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలని ప్రభుత్వం చాలా అవగాహన కార్యక్రమాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే అన్ని స్మార్ట్‌ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ ఇన్‌బిల్ట్ ఫీచర్ కింద అందివ్వనున్నారు. ఈ యాప్‌ను ఇప్పటికే 7.5 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే కరోనా ముప్పుపై హెచ్చరించేందుకు ఫీచర్ ఫోన్ల కోసం కూడా కొత్త సాంకేతికతను రూపొందిస్తున్నట్లు కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

Post a Comment

0 Comments