లుకెమియాకు చికిత్స.. ఆలస్యం చేయొద్దు..


  • ప్రారంభ దశలో చికిత్స అందిస్తే మంచి ఫలితాలు
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వైద్యులను సంప్రదించాలి
  • అపోలో ప్రముఖ వైద్యురాలు పద్మజా లోకిరెడ్డి

లుకెమియాకు చికిత్స.. ఆలస్యం చేయొద్దు..
Dr.PadmajaLokireddy
MD,MRCP,FRCPath (Haematology)
Consultant Haemato oncology and Stem cell Transplant
Apollo Hospitals, Jubilee Hills, Hyderabad.

అక్యూట్​ లుకేమియగా బ్లడ్​క్యాన్సర్​ అత్యంత ప్రమాదకరమని, ప్రారంభ దశలోనే చికిత్స అందిస్తే మంచి ఫలితాన్ని సాధించవచ్చని  కన్సల్టెంట్​ హేమాటో–ఆంకాలజీ& స్టెమ్​సెల్​ మార్పిడి అపోలో వైద్యురాలు పద్మజా లోకిరెడ్డి తెలిపారు.  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని రోగులకు ఆమె సూచించారు. ఇవే లక్షణాలు కరోనా పరీక్షకు, ఐసోలేషన్​కు గురికావచ్చని చెప్పారు. చాలా మంది రోగులు  కీమోథెరపి వాయిదా వేయడంతో బాధలు పడుతున్నారని,  తీవ్రతరం అయితే జన్యుపరమైన అసాధారణతలతో లుకెమియా ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని చెప్పారు.

తెల్ల రక్త కణాలు అధిక సంఖ్యలో ఏర్పడే హైపర్​లూకోసైటోసిస్​ అనే సమస్యను ఎదుర్కొంటారని తెలిపారు. చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లను అందించాల్సిన రక్త సంబంధిత క్యాన్సర్​ రోగులు, ప్రధానంగా మైలోమా క్యాన్సర్​ రోగులకు కోవిడ్​–19 ప్రభావానికి గురైతే తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్​ఫెక్షన్​, న్యూమోనియా వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని స్పష్టం చేశారు. 

ట్రాన్స్​ప్లాంట్​ ఆలస్యంతో మినిమల్​ రెసిడ్యుయల్​ డిసీజ్​ (MRD)తిరగబడి ట్రాన్స్​ప్లాంట్​ తరువాత మనుగడపై ప్రతికూల ప్రభావంతో మరో సమస్యకు దారితీస్తుందన్నారు. ప్లేట్​లెట్​ కొరతతో బ్లడ్​ క్యాన్సర్​ చికిత్స సమయంలో సమస్యగా మారుతుందని, ప్రస్తుతం చాలా బ్లడ్​బ్యాంక్​లలో ఎర్ర రక్త కణాలు నిల్వలు తగినంత ఉంటున్నాయని తెలిపారు. జనరల్​ లుకెమియాకు చికిత్సను ఆలస్యం చేయొద్దని రోగులకు సూచించారు.