వలస కార్మికునికి....

వలస కార్మికునికి....
వలస కార్మికునికి....     

శ్రమైక జీవుల
స్వేద బిందువులకు
నీరాజనాలు,
అశ్రు నీరాజనాలు !

ఆకలి కోసం, అన్నం కోసం
అడవులు కొండలు ఎన్నో దాటి
అడుగులు కదిపీ...
ప్రాంతం మారి, ప్రేమలు,
ప్రేగులు అన్నీ వదిలి,
కస్టం చేసే కర్మ వీరులకు
నీరాజనం, అశ్రు నీరాజనం!

కరకు చూపులను తట్టుకుని,
కటిన మాటలను ఒప్పుకుని ..
("ఒరేయ్ కళ్లు దొబ్బాయారా...
నా కొడకా సరిగా పని చెయ్యి"....)
బాధను కంట్లో పొదుముకుని....
దేశ నిర్మాణంలో భాగం అవుతున్న
నగర నిర్మాణంలో భాగం అవుతున్న
వలస కార్మికునికి నీరాజనం,
అక్షర నీరాజనం,
గజల్ నీరాజనం!

(మద్యలో మాట :  అయ్యా మా గుండెల్లో బాధను ఎవరికి చెప్పుకోగలం? మావి చిన్న బ్రతుకులు! మాకు అంత శక్తి లేదయ్యా! అలిసిపోయాము! మాకు మిమ్మల్ని చూస్తే భయం!....అవమానాలకు అలవాటు పడిపోయిన బ్రతుకులయ్యా మావి. మాకు ఇది చెయ్యండి, అది చెయ్యండీ అని అడిగేoత నేర్పు,ఓర్పు మా దగ్గర లేదయ్యా! మా వల్ల దేశం పరువు పోతే మమ్మల్ని క్షమించండి! క్షమించండి! (గద్గద స్వరంతో...))

లెక్కల్లో లేని వాళ్లం
మైలేజులు రాని వాళ్లం,
మైళ్ల దూరం పోతున్న వాళ్లం!
నడిచి పోతున్న వాళ్లం! (రహదారులం!)
ట్రంకు పెట్టి పాత సంచీ....
చంటి బిడ్డ భార్య దిగులు...
ఊరు గుబులూ, కొత్త రోగం....
కదిలి పోతున్నాo కరోనా దారిలో...
బ్రతుకు బాధలో....

(మాట : అయ్యా, అయ్యా...ఈ మహమ్మారి రోగం పోయాక మా బతుకు మాకు మళ్లీ వస్తుoదా అయ్యా! మళ్లీ నాలుగు మెతుకులు మేము గౌరవంగా తినగలమా అయ్యా! వందల మైళ్ల దూరంలో ఉన్న మా ముసలమ్మకు నాలుగు పైసలు పంపగలమా అయ్యా?! చావో బ్రతుకో మా ఊరిలో, మా మనుషుల మద్య....బ్రతికి ఉంటే తప్పకుండా మళ్లీ వస్తామయ్యా! మీరు రానిస్తారు కదూ! ఈ దేశ పౌరులమే నయ్యా మేము. కానీ లెక్కల్లో లేని వాళ్లం!)

ప్రాణం విలువ, దేశం విలువ,
దేహం విలువ, దు:ఖం విలువ
తెలీని వాళ్లం! మన్నిస్తారా?
మమ్మల్ని క్షమిస్తారా, స్నేహితులారా! మళ్లీ కలుద్దాం!
మీరూ జాగ్రత్త మిత్రులారా!

   
 శ్రీనివాస రాజు పెన్మెత్స 
        9550 981 531