దండం పెట్టి చెబుతున్నా..

దండం పెట్టి చెబుతున్నా..
దండం పెట్టి చెబుతున్నా..

దండం పెట్టి చెబుతున్న 
నా మాట వినరన్నా..
కబళిస్తుంది కరోనా ,
మహమ్మారి కరోనా
నేను నువ్వు మన మందరము
కలసి కట్టుగా ఆపాలి ,
లోకాన్ని కాపాడాలి..
                                            //నేను /దండం //

సునామీల మించిన విపత్తు
తుఫానుల కూల్చేసింది
అణుబాంబులను మించిన యుద్ధం
అణువు రూపం లొ చేరింది..
                                        //నేను /దండం //

ఎటు నుండి ప్రాకిందో ,
ప్రాణాలను బలితీస్తుంది
మందులేని వైరస్ బారిన పడవద్దు ఒరన్నా
గడప దాటి నువ్వు వెళ్లొద్దు ,
గందర గోళం చేయొద్దు ..
                                           //నేను /దండం //

ఆరోగ్యమే మహా భాగ్యమని
అంటే ఏమో అనుకున్నాం
కారొన బారిన పడ్డావంటే ,
జీవితమే ఇక సున్నా :
ఐనా ఇంకా నిర్లక్షమా !
నీకిక తగదు ఓరన్న
జాగ్రత్తలన్నీ పాటించు ,
పరిశుభ్రత కొనసాగించు..
                                         //నేను /దండం //

మన రక్షణ తమ భాద్యత అంటూ
కదిలారు మహా మనుషులు
అందరి హితమును కోరే వారే
దేశ భక్తులు ఈనాడు
నిన్ను నువ్వే నిర్బందించు ,
సూచనలన్నీ పాటించు,
కరోనాను తరిమి కొట్టు...
                                         //నేను /దండం //

దండం పెట్టి చెబుతున్నా..
డాక్టర్ బండారు సుజాతశేఖర్ 
 హైదరాబాద్​
 98664 26640