గెలుపు వెలుగు

Winner_harshanews.com
Image by TeeFarm from Pixabay 


పల్లవి : 

రండి
దూకండి ఆడండి ధైర్యం మీది విజయం మీది!
త్యాగం మీది తెగింపు మీది!
శక్తీ మీదే! సత్తువ మీదే!
రండి దూకండి ఆడండి
ధైర్యం మీది విజయం మీది!

చరణం 1 : 

ఎవరెస్టు ఎమన్నదిరా?
నీ కోసం నేనన్నది రా
పై కొచ్చి సాధించ మన్నది రా
చెయ్యెత్తి జై కొట్టమన్నది రా!
సివిల్స్ రాంకు ఏమన్నది రా?
సాధించి బోధిoచి మన్నది రా?
సాద్యo కానిది లేదన్నది రా!

రండి కదలండి,
దూకండి ఆడండి
ధైర్యం మీది విజయం మీది!

చరణం :  2

చందమామ ఏమన్నదిరా?
ఆకాశాన్ని తిరగెయ్య మన్నది రా!
నక్షత్రాలను బోర్లించ మన్నది రా !
నడుచుకుంటూ రా రమ్మన్నది రా!
నీ అడుగుకి పునాది నే నన్నది రా !

రండి కదలండి,
దూకండి, ఆడండి,
ధైర్యం మీది విజయం మీది!
నెత్తురు మీది సత్తువ మీది!

చరణం 3 : 

సప్త సముద్రాలు ఏమన్నవి రా ?
అలల కలలపై ఆడుకొమ్మన్నివి రా!
కలల అలల పై పాడుకో మన్నవి రా
లోపల దాచిన వజ్ర వైడూర్యాలను
వెతుక్కోమన్నవి రా!

రండి కదలండి,
దూకండి ఆడండి
ధైర్యం మీది విజయం మీది!

చరణం 4  : 

జీవితం ఏ మన్నది రా?
శోదించి సాధించ మన్నది రా!
గెలుపు వెలుగై విహరించ మన్నది రా !
బ్రతుకు మెరుపై పయనించ మన్నది రా !

రండి కదలండి
దూకండి ఆడండి
ధైర్యం మీది విజయం మీది!

     
Winner_harshanews.com
శ్రీనివాస రాజు పెన్మెత్స 
9550 981 531