జ్ఞాపకాల దొంతర్లు..

జ్ఞాపకాల దొంతర్లు..
Image by Bruno /Germany from Pixabay 

నీ స్మృతిని కవిత్వంగా 
స్థిరంచేయాలనుకున్న 
ప్రతిసారి కలం రాల్చిన 
సిరా కన్నీరైయింది. 

కంటినిండా జ్ఞాపకాల దొంతర్లే 
నీవే నా ధైర్యము,
నా సాహసం, నా లక్ష్మి .

నీ మాటలే నా వేదం 
జీవం ,రాగం -
నీవు నడిచిన బాటే - 
నా మార్గం.. గమ్యం .

నీలో నీవు సృష్టించుకుని 
ఆచరించిన సమాజం 
కుల మత వర్గ వైషమ్యాలు లేని 
విశ్వ మానవ సౌబ్రాతృత్వ నినాదం. 

నీవు చూపిన మార్గం 
సమతా మమతాను బంధాల సంబరం -
అనిర్విచనీయ ఆప్యాయత ఆత్మీయత 
ప్రతిరూపం నీ అనురాగం -

ఎదిగే ప్రాయం లో 
నిన్ను జ్ఞాపకంగా చేసి ,మా జీవాలను 
ఆత్మలేని ప్రాణాలు చేసింది విధి -

పదమూడేండ్ల ప్రాయం 
ఇంకా నాకు జ్ఞాపకమే -
ఎన్ని సంవత్సరాలు,
అనుభవాలు , ఆటుపాట్లో 
అయినా నా అమ్మా నాన్నల ప్రేమ 
రాజ్యంలో నేనింకా పసిదాన్నే..

నాన్న --మీ పేరు విన్న క్షణం 
నా మనసు గర్వంతో కొత్త జీవమౌతుంది. 

నీ జ్ఞాపకాల దొంతర్లోంచి 
రాలుతున్న ఒక్కొక్క సిరా చుక్క 
నా భవ్యం.. భవితవ్యం .


జ్ఞాపకాల దొంతర్లు..
Dr.Bandaru Sujathashekar,
Hyderabad.
98664 26640