పోటు - చేటు

పోటు - చేటు
Image by Steve Buissinne from Pixabay 

అధిక రక్తపోటు !
ఆరోగ్యానికది చేటు !!

ఆహారంలో తగ్గించు ఉప్పు !
తృణ ధాన్యాలతో లేదు ఏ ముప్పు !!

శారీరక శ్రమను పెంచు !
అధికమయిన బరువును కుదించు !!

మత్తు పదార్థాల సేవనం !
నాడీ వ్యవస్థ ఇక అచేతనం !!

జంక్ ఫుడ్ కు ఉండు దూరం !
లేకుంటే జీర్ణ వ్యవస్తకది భారం !!

ధూమపానం ఊపిరి తిత్తులకు గాయం !
జనాభా లెక్కల్లో నీవిక మటుమాయం !!

పళ్ళ రసాలతో కలిగించును రోగనిరోధం !
నీ జీవితానికి లేదిక ఏ అవరోధం !!

వైద్యుల సూచనలు పాటించు !
ఆరోగ్య సూత్రాలు అందరికి చాటించు !!

సమతులాహారంతో సాగించు జీవన జైత్రయాత్ర  !
కాదంటే నీకు మిగిలేది అంతిమయాత్ర !!

క్రమమయిన జీవితంతో దరి చేరదు బి.పి !
అందరి జీవితాలిక హ్యాపీ !!

 
పోటు - చేటు
వోరుగంటి శ్రీ వెంకటేశ్ బాబు
 డాబాల బజార్, ఖమ్మం
98497 40116