ఓ మనిషి.. నువ్వే ఓ మనీషి...

ఓ మనిషి.. నువ్వే ఓ మనీషి...
Image by Pexels from Pixabay 
ఓ మనిషి.. నువ్వే ఓ మనీషి...
నీ ‘స్వార్ధం’తో చేసే పనిలో 
వున్న బలం అణువంత అయితే, 
నిస్వార్ధంతో చేసే పనిలో 
ఓ మనిషి.. నువ్వే ఓ మనీషి...
శ్రీకాంత్ గోటూర్ 
ఉన్న బలం ఆ ఆవని అంత.

ప్రతి మనిషి దేవుణ్ణి ఏదో కోరతాడు.
నువ్వు ‘ప్రతి మనిషి’ కోసం 
నిలబడితే ఆ దేవుడే నిన్ను కోరతాడు.

మానవత్వమే నీ అభిమతమై, 
మదిలో సాయం కోరే చేతులకు 
చేయూత నిచ్చే మనసే వుంటే...

ఓ మనిషి, అవుతావు 
నువ్వే మనీషివి 
దేవుడే చెక్కిన గొప్ప నగిషీవి.

శ్రీకాంత్ గోటూర్ 
హైదరాబాద్