చీటింగ్​ కేసు.. ఇద్దరు అరెస్టు


  • నిందితుల నుంచి రూ. 1.5లక్షలు స్వాధీనం
  • వివరాలు వెల్లడించిన మియాపూర్​ సీఐ వెంకటేశ్​

చీటింగ్​ కేసు.. ఇద్దరు అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న మియాపూర్​ సీఐ వెంకటేశ్​

హైదరాబాద్​: అమాయక ప్రజల్ని మోసం చేస్తున్న ఇద్దరిని  పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన సోమవారం మియాపూర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్​ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లాకు చెందిన ఓబుల్​రెడ్డి(26), సుస్మిత (40)లు అమీన్​పూర్​ ప్రాంతంలో నివాసముంటున్నారు.  మియాపూర్ ప్రాంతంలో ఉన్న లక్ష్మి హ్యుందాయ్ కార్ షోరూం లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నారు. కార్లు బుక్ చేసుకున్న కస్టమర్లకు  ఫోన్ చేసి లాక్ డౌన్ టైమ్ లో కూడా కార్లు డెలివరీ చేస్తామని చెప్పి ఇద్దరు కస్టమర్ వద్ద సుమారు 7లక్షల రూపాయలు తమ స్వంత ఖాతా లోకి జమ చేయించుకున్నారు. కార్లు ఎంతకీ డెలివరీ అవకపోవడంతో అనుమానం వచ్చిన వినియోగదారులు షో రూమ్ కి వచ్చి విచారించగా  ఓబుల్ రెడ్డి, సుస్మిత లు మోసం చేశారని తెలిసింది. దీంతో మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఈనెల 13న  ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న మియపూర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితులు ఇద్దరిని సోమవారం పట్టుకొని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి.  నిందితుల వద్ద నుంచి  రూ. 1 లక్ష 50 వేల నగదు, రూ. 50 వేల విలువగల 4 సెల్ ఫోన్స్, 30 వేల విలువగల 3 బంగారు రింగులు, 15 వేల విలువ గల టీవి స్వాధీనం చేసుకున్నట్టు సీఐ వెంకటేశ్​ తెలిపారు.  నిందితులను అరెస్టు చేసి  రిమాండ్ కు తరలించామని ఆయన వెల్లడించారు.