హావ్​మోర్​ ఐస్​క్రీం ఇక ఇంటివద్దకూ...


  • ‘హావ్​ మోర్​ ఐస్​క్రీం ఎక్స్​ప్రెస్​’ స్టోర్​ యాప్​ ప్రారంభం
  • డన్జోతో  హావ్​మోర్​ ఒప్పందం
  • హావ్​మోర్​ ఎండీ అనిన్​ద్య దత్తా

Havmor Ice Cream Partners with Dunzo
హావ్​మోర్​ ఐస్​క్రీం ఇక ఇంటివద్దకూ...

          వినియోగదారులకు ఐస్​క్రీంలను ఇంటివద్దకే అందించేందుకు ‘హావ్​మోర్​ ఐస్​క్రీం ఎక్స్​ప్రెస్​’ యాప్​ లాంఛనంగా ప్రారంభించింది. దీంతో పాటు సకాలంలో డెలివరి చేసేందుకు డన్జోతో హావ్​మోర్​ ఒప్పందం కుదుర్చుకుంది.   హావ్​మోర్​ ఐస్​క్రీం ఎండి అనిన్​ద్య దత్తా మాట్లాడుతూ వినియోగదారులు ఆర్డర్​ చేయగానే డోర్​ డెలివరికి డన్జోకు తెలుపడంతో వినియోగదారులకు త్వరగా అందజేసే అవకాశమున్నట్టు తెలిపారు.
          వినియోగదారుల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఆన్​లైన్​ డెలివరీ ప్లాట్ ఫాం డన్జోతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.  హావ్​మోర్​ ఉత్పత్తులతో వినియోగదారులకు సంతోషాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. హైద్రాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గురుగ్రామ్, జైపూర్, ముంబై ,పూణేలతో సహా 8 నగరాల్లో డెలివరీ సర్వీస్​కు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.  వినియోగదారులు ఎక్కువ ఇష్టపడే  కుకీ అండ్ క్రీమ్, మామిడి మ్యాజిక్, జులూబార్, మట్కా కుల్ఫీ, నట్టి బెల్జియన్ డార్క్ చాక్లెట్, శాండ్‌విచ్ ఐస్ క్రీమ్, అమెరికన్ నట్స్, బ్లాక్ ఫారెస్ట్ ఐస్ క్రీమ్ కేక్, అల్ఫోన్సో మామిడి, కుకీ క్రీమ్, బటర్ స్కాచ్ లు అందుబాటులో ఉంటాయన్నారు.