కొత్త దారులుకొత్త దారులు
కొత్త దారులు

దేహం ఒక వైపు
దేశం ఒక వైపు
తేల్చుకోమంటే
కదిలాను దేశం వైపునకు!

దారి ఒకవైపు
దాహం ఒకవైపు
దయ చూపమంటే
చూసాను దాహం వైపునకు!

ఆకలి ఒకవైపు
ఆరాటం ఒకవైపు
కలిసి రమ్మంటే కలిశాను
ఆకలి చేతులతో!

చదువు ఒక వైపు
జ్నానం ఒక వైపు
నీవు ఎటువైపంటే..
కదిలాను జ్నానం వీధులకు!

జాలి ఒకవైపు
హింస ఒకవైపు
"పులి ఒక వైపు
లేడి ఒక వైపు..."
నీవు ఎటువైపంటే....
శాంతి వైపంటూ
పావురమై ఎగిరాను!

దేహం ఒక వైపు
దేశం ఒక వైపు...
తేల్చుకోమంటే
కదిలాను దేశం వైపునకు!

           
కొత్త దారులు
    శ్రీనివాస రాజు పెన్మెత్స 
        9550 981 531