అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ అమ్మకాలు ప్రారంభం

     
Flipkart,amazon starting open sales

        కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ కేంద్రం పొడగించిన విషయం తెలిసిందే.. ఈ సారి మాత్రం పూర్తిస్థాయిలో కాకుండా కొన్ని సడలింపులకు అవకాశం కల్పించింది. కేంద్రం జారీ చేసిన వాటిలో ఈ కామర్స్​ అమ్మకాలు ప్రారంభం చేసుకోవచ్చు. దీంతో నేటి నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కంపెనీలు నిత్యావసరేతర వస్తువులను డెలివరీ చేసేందుకు సమాయత్తమయ్యాయి.. అన్నీరకాల గాడ్జెట్స్ తో పాటు కన్జ్యూమర్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌ తో సహా ఇ-కామర్స్ సంస్థలు కరోనా వైరస్ చాలా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే అమ్మకాలు జరుపుతున్నట్లు ఆయా కంపెనీల ప్రతినిధులు తెలిపారు. రెడ్ జోన్లలో మాత్రం కిరాణా సరుకులు, మెడికల్, చిన్నారులకు సంబంధించి వస్తువులు మాత్రమే అందిస్తున్నట్లుగా తెలిపారు. కేంద్రప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయా జోన్లలో మాత్రమే ఆర్డర్లను అందిస్తామని, సాధారణ రోజుల్లో అందించే సమయం కంటే లాక్ డైన్ పీరియడ్ లో డెలివరీ చేసే సమయం ఎక్కువ అని తెలిపింది.ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ప్రజలకు అవసరమైన వస్తువులను సురక్షితంగా డెలివరీ చేసేందుకు ప్రభుత్వం తమకు అనుమతినిచ్చేలా నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపాయి.