చిట్యాల వద్ద రోడ్డు ప్రమాదం


  • ముగ్గురు మృతి
  • మృతులు తూర్పు గోదావరి జిల్లా వాసులు
  • హైదరాబాద్​కు వస్తుండగా ఘటన

చిట్యాల వద్ద  రోడ్డు ప్రమాదం
ప్రమాదానికి గురైన కారు..


చిట్యాల వద్ద  రోడ్డు ప్రమాదం
మృతి చెందిన శ్రీనివాస్​
రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని వట్టిపర్తి శివారులో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాలు ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన గిరిశాల శ్రీనివాస్‌ (45) కుటుంబసభ్యులతో కలిసి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు నల్గొండ జిల్లా చిట్యాల మండలం  వట్టిమర్తి శివారులో జాతీయ రహదారి పక్కన ధాన్యం లోడుతో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో శ్రీనివాస్​తో పాటు లక్ష్మీ (30), లక్ష్మీ చందన (28) అక్కడిక్కడే మృతి చెందారు. కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ముగ్గురు పిల్లలున్నట్లు తెలిపారు.  మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి  తరలించారు. ఈ మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.