"సంకేతం’’

"సంకేతం’’
"సంకేతం’’

"బాపూ మళ్ళీ పుట్టాలి "

మనిషి మనసే
సంఘర్షణల కొలిమిగా
నిత్యం సాగుతున్న
అధిపత్యాల పోరు
కల్మష సంద్రాల
సునామీల సృష్టిస్తూ
కలికాలం -న్యాయం ,
ధర్మం అర్ధాల
మారుస్తూ ;తానే నాయకుడు
అనుకుంటున్న మనసు
కుతంత్రాల తంత్రంతో
హింసాహింసల
తేడా నెప్పుడో మరిచింది -
అఖండ భరతమాత
శృంఖలాల విడిపించి ,
రవికాంచని రాజ్యం మాదేనన్న
అధిపతుల ఝులుమ్ నేలరాసిన
నీమార్గం అహింస .

ఏమూల ప్రపంచ ఏనోట విన్నా
అహింస సంకేతానివి నీవే .---
బాపూ నీవు చరితవు ,మా చరితల
ప్రధాతవు -
నిన్నను మరిచి ,నేటిని విడిచి
రేపటి వికట చేష్టలకు
ఆజ్యమౌతున్న
అకృత్యాలు
అలజడులు
కులమత వర్గవైషమ్యాలు
అహింసో పరమో ధర్మ :అన్న
నినాదంతో  తొలగాలి.

రేపటి సమతా శాంతుల నవ్య భారతానికి ఊపిరవ్వాలి .
మాదైవం ,ఆయుధం నీవే
బాపు అహింస మార్గమై -నీవు మళ్ళీ
పుట్టాలి -మా అహింసవై

బాపూ మళ్లీ పుట్టాలి .
బాపు మళ్ళీ పుట్టాలి...


"సంకేతం’’
డాక్టర్​ బండారు సుజాతశేఖర్​,
హైదరాబాద్​,
సెల్​: 98664 26640