చీల్చి ఛెండాడుతాం.. కరోనా..

చీల్చి ఛెండాడుతాం.. కరోనా..
Image by Tumisu from Pixabay 
మాయలాడి మహమ్మారి కరోనా..
మదమెక్కి చిందేస్తున్నావే పిశాచి..
ఇందు లేదు అందు లేదని పరిగెడుతూ..
పిల్లా లేదు పెద్దా లేదని చొరపడుతూ..
సిరులొలుకు వేదభూమి
నా దేశమని తెలియదా..
పుణ్యనదుల పూలదండ
నా దేశమని తెలియదా..
సనాతన ధర్మమే
మా ఆచారమని తెలియదా..
నీతి లేని నిన్ను సహించలేము కరోనా..
నీ జాతకాన్ని తిరగరాస్తాం కాస్కో కరోనా..
ఆదిశక్తిని మరచితివా రక్కసి కరోనా..
చీల్చి ఛెండాడుతాం ఖబర్దార్​ కరోనా..
కరములు జోడించి
జైహింద్​ అంటాము కరోనా..

నాట్యమయూరి టీవీ శీరీష, 
         హైదరాబాద్​.

TV Shirisha