ప్రమిద

ప్రమిద
Image by OpenClipart-Vectors from Pixabay 

ఓ నర్సమ్మా 
నీకు వందనం !
అభివందనం !!
ప్రమిద
వోరుగంటి శ్రీ వెంకటేష్ బాబు

మీ వృత్తి ఉన్నతం !
మీ సేవ మహోన్నతం !!

అమ్మ ప్రేమను మరిపించు !
విధినిర్వహణలో తరించు !!

మోము పై చెరగని దరహాసం !
అందరికి మీ ఎడల అచంచల విశ్వాసం !!

రోగులే మీకు లోకం !
మీరు ఏ లాభాపేక్షలేని మాలోకం !!

ప్రజారోగ్యసాధనలో మీరో ప్రమిద !
సమాజాసేవాగ్నిహోత్రంలో మీరో సమిధ !!

సేవాతాత్పరతకు మీరు స్ఫూర్తి !
'ఫ్లోరెన్స్ నైటింగేల్' వారసులుగా కీర్తి !!

రోగుల సేవలో అలుపెరగని ప్రయాణం !
చేస్తున్నా మీ సేవకు శిరస్సు వంచి ప్రణామం !!

సందర్భం : నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా  వారికి నా అక్షర కానుక...

వోరుగంటి శ్రీ వెంకటేష్ బాబు
98497 40116
ఖమ్మం, తెలంగాణ.