"మామిడి మహారాజు"


"మామిడి మహారాజు"
"మామిడి మహారాజు"
వచ్చెను వచ్చెను వేసవి వేడి
తెచ్చెను తెచ్చెను ఎండల హోరు
వీచెను వీచెను వడగాలులతో,సుడిగాలులతో
చెమటకు చేరువగా నవ్వులకు 
నీరసముగా,నిసత్తువగా తోచెను.

పరిస్థితులు ఇలా వుండగా...
భలే భలే అందాలు సృష్టించాడు,
మురిపిస్తూ వచ్చెను మామ మామిడి.

పూతగా,పిందెగా,కాయగా, పండుగా.. ఆహా భళి భళి భళిరా భళి.. సాహోరె మామిడి రాజా. తన నిండైన ,తీయ్యని మనసుతో జనులను ఆకట్టుకొని వేసవి అతిథిలా విచ్చేసింది. పచ్చ,  పసుపు, ఎరుపు రంగు చొక్కలే తనకు ఇష్టమని, ఎండ తాపానికి ఈ రంగులో సేద తీరుతానని,వేసవిలో అందరూ నన్ను గారంతో నెత్తి మీద బుట్టలో  కూర్చోబెట్టి సకల మర్యాదలతో చూస్తారని సహచరులతో చెప్పెను. వేసవిలో ప్రకృతి అంతా నా రాజ్యమే,నేనే రాజుని మీరంతా నా దాసీ దాస జనులు అని మనసులో గర్వపడింది.పెళ్ళిళ్ళు, పేరంటాలలో నేనే పెద్దదిక్కుని మరి.

నాకు విహంగ ప్రయాణాలంటే చాలా ఇష్టం.దూర దూర దేశాలన్ని చూసాను..కానీ మన భారతదేశ ఆదరణ,అభిమానం,ఆప్యాయత మరువలేను సుమ!! అందుకే

 "మేరా భారత్ మహాన్, కరో ఆమ్ కా సమ్మాన్".
"మామిడి మహారాజు"

 నాట్యమయూరి టి.వి.శిరీష,
హైదరాబాద్​.
96184 94909