జీవితం

జీవితం
Image by Barroa_Artworks from Pixabay 

జీవితం ఒక్కోసారి
ఇది  మాయాజూదం!

ఎదురు దెబ్బలు తప్పవు,
గొప్పి తగులుతుంది,
గొయ్యిలో పడతాం,
దుమ్ము దులుపుకుంటాం!
చర్మం గీసుకుoటుoది,
మో చిప్పలు ఒక్కోసారి పగిలిపోతాయి!
"కాలం" గాయాలకి మందు వేస్తుoది....

దెబ్బల అనుభవాలతో
కొత్త  జీవితం నిర్మించుకోవాలి!

గోతిలో పడ్డప్పుడు
నిరుత్సాహ పడితే...
గాయం తగిలినప్పుడు
చిగురుటాకులా ఒణికిపోతే...
తుఫాను భీభత్సంలో
మెరుపు అందాన్ని చూడకపోతే......

ఇంకా చెప్పాలా?
మనమెంత కోల్పోతామో!!!
జీవితం ఇచ్ఛే వజ్ర వైడూర్యాలు,
మణిమానిక్యాలు అన్నీ!

ఒక "అల" ఆల్చిప్పలు,
గుడ్డి గవ్వలూ తెచ్చిందని...
సముద్రాన్ని నిందించ వొద్దు!

రాబోయే "అల"
ఏ మహా అద్భుతాన్ని దాచి ఉంచిందో!

జీవితం సముద్రం!
కర్మ యోగాన్ని విడవొద్దు!
సహనంతో, ధర్మంతో
నిరంతర సాధన మానొద్దు!

చిరునవ్వుతో అడుగులు
ముందుకే కదపండి!
ఏంతో గొప్పది జీవితం!
మయా జూదం కాదు!

అపజయం
ఒక చిన్న విశ్రాంతి మాత్రమే!
ఆ అనుభవంలో ఏనుగు బలం ఉంది!
సింహ గర్జనకు పునాది అది!

రండి!
దూకండి! ఆడండి!
ధైర్యం మీది! విజయం మీది!

 
జీవితం
  శ్రీనివాస రాజు పెన్మెత్స 
9550 981 531