ఎరువుల అమ్మకాల్లో ఆర్‌సీఎఫ్ వృద్ధి



న్యూఢిల్లీ, మే 10: కోవిడ్-19 లాక్‌డౌన్ వల్ల ఎదురైన అనేక లాజిస్టిక్, ఇతర సవాళ్లు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలోని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని పీఎస్‌యూ అయిన రాష్ట్రీయ కెమికల్స్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్) గొప్ప పనితీరును ప్రదర్శించి 2019 ఏప్రిల్‌తో పోలిస్తే 2020 ఏప్రిల్ నెలలో ఎన్‌పికె ఎరువులు సుఫల అమ్మకాలలో 35.47 శాతం పెరుగుదలను నమోదు చేసింది.

వ్యవసాయ పోషకాల అవసరాలను తీర్చడంలో ఉత్సాహాన్ని కనబరిచిన ఆర్‌సిఎఫ్‌ను రసాయన, ఎరువుల మంత్రి డీవీ సదానంద గౌడ అభినందించారు. ఈ ఉత్సాహకరమైన అమ్మకాలతో రైతులు అధిక దిగుబడిని పొందుతారని, కోవిడ్-19 మహమ్మారిని అరికట్టడానికి ప్రకటించిన లాక్‌డౌన్ ఇబ్బందులను అధిగమించి దేశంలోని రైతులకు సహాయం చేయడానికి తన మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ ఎరువుల పీఎస్‌యూలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

గౌడ తన ఎరువుల శాఖతో పాటు, విత్తు వేసే కాలంలో అవసరమైన ఎరువుల ఉత్పత్తి, రవాణా, పంపిణీని సులభతరం చేయడానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖలు/కేంద్రంలోని ఇతర సంబంధిత విభాగాలలో, రాష్ట్రాలు/యూటీలలో తన సహచరులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు.

కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో, మహారాష్ట్ర వ్యవసాయ శాఖ సహాయంతో రైతులకు ఎరువులు నిరంతరం సరఫరా చేసేలా ఆర్‌సిఎఫ్ చర్యలు తీసుకుంటుందని ఆ సంస్థ సీఎండీ ఎస్‌సీ ముద్గేరికర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. రైతుల భద్రత కోసం, వ్యవసాయ క్షేత్రాల సరిహద్దు వద్ద ఎరువులు పంపిణీ చేస్తున్నారు. ఇది కాకుండా ఆర్‌సీఎఫ్ ట్రోంబే యూనిట్ 6.178 ఎంకే క్యాలరీ/ఎంటీ శక్తి సామర్థ్యంలో కొత్త మైలురాయిని నెలకొల్పింది.

కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ పట్ల బలమైన విశ్వాసం ఉన్న ఆర్‌సీఎఫ్, దీనిలో భాగంగా, నిరుపేదలకు ప్రయోజనం చేకూర్చడం, సర్వ జన శ్రేయస్సు కోసం, పీఎం కేర్స్ ఫండ్‌కు 83.56 లక్షలు, మహారాష్ట్ర సీఎంఆర్‌ఎఫ్‌కు 83.50 లక్షలు అందించింది. ఆ ఉద్యోగులు కూడా ముందుకు వచ్చి ఒక రోజు జీతం అందించారు.


‘మినీ రత్న’ అయిన ఆర్‌సీఎఫ్ , దేశంలో ఎరువులు, రసాయనాల తయారీలో ప్రముఖమైనది. ఇది యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, బయో ఎరువులు, సూక్ష్మ పోషకాలు, నీటిలో కరిగే ఎరువులు, అనేక రకాల పారిశ్రామిక రసాయనాలను తయారు చేస్తుంది. ఈ సంస్థ గ్రామీణ భారతంలో ఇంటింటికి ఒక చిరునామాగా మారి, ‘ఉజ్జ్వలా’ (యూరియా), ‘సుఫలా’ (కాంప్లెక్స్ ఎరువులు) బ్రాండ్లతో అధిక బ్రాండ్ ఈక్విటీని కలిగి ఉంది. ఎరువుల ఉత్పత్తులతో పాటు, రంగులు, ద్రావకాలు, తోలు, ఫార్మస్యూటికల్స్, ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల తయారీకి ముఖ్యమైన పారిశ్రామిక రసాయనాలను కూడా ఆర్‌సీఎఫ్  పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేస్తుంది.

Post a Comment

0 Comments