రోడ్డు ప్రమాదంలో ఆర్​ఎస్సై మృతి


  • అదుపు తప్పిన బొలెరో
  • వరంగల్​ జిల్లాలో ఘటన


అదుపు తప్పిన బొలెరో వాహనం
అదుపు తప్పిన బొలెరో వాహనం
కర్ణుడు ఐడీ కార్డు
కర్ణుడు ఐడీ కార్డు


మృతి చెందిన ఆర్​ఎస్సై కర్ణుడు
మృతి చెందిన ఆర్​ఎస్సై కర్ణుడు
ఓ వాహనం అదుపుతప్పిన ప్రమాదంలో ఆర్​ఎస్సై మృతి చెందిన ఘటన ఆదివారం యాదాద్రి-భువనగిరి జిల్లా ఆలేరులోని హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై పెంబర్లి కమాన్ వద్ద చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళ్లితే.. వరంగల్​ పీటీసీకి చెందిన ఆర్​ఎస్సై కర్ణుడు (36) ఆదివారం హైదరాబాద్ బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్నాడు. జాతీయ రహదారిపై ఉన్న పెంబర్తి కమాన్ వద్దకు రాగానే బొలెరో వెనుక టైరు పంక్ఛర్ అయ్యింది. దీంతో వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డుపై పల్టీలు కొట్టింది. దీంతో కర్డుడు అక్కడికక్కడే మ‌ృతి చెందాడు.  మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.