అమ్మకో రోజా!!!


అమ్మకో రోజా!!!
అమ్మతో.. నేను

నాన్నకూచిలా కనిపిస్తూ
అమ్మనామమే జపిస్తూంటాను
అనుక్షణం.

టీనేజ్ లో యవ్వనం
పలకరించినప్పుడు,

పెళ్ళినాడు అత్తారింటికి
పయనమైనపుడు,

బిడ్డను జన్మిస్తూ
నొప్పులిస్తున్నప్పుడు,

చిన్నపుడు ఆటల్లో,
పెద్దయ్యాక జీవితంలో....
ఎదురుదెబ్బలు తగులుతున్నప్పుడు...

ఇలా ప్రతీక్షణం 
నను అక్కున పొదువుకొని ,
నాపక్కనుండేది నువ్వేకదమ్మా...


కనిపించే దైవమా,
కని పెంచిన దేహమా....

నీకు నేను అమ్మై పుడితే తప్ప
తీరనిది నీ ఋణం 

క్షణక్షణం గుర్తొచ్చేఅమ్మ

అలాంటి అమ్మనే మరచిపోతున్న ఈరోజుల్లో
అమ్మకోసం ఒకరోజు.

జన్మనిచ్చిన ఆ అమ్మకు ఒకరోజా.. 

మాతృదినోత్సవ శుభాకాంక్షలు
జ్యోతిరాజ్.భీశెట్టి(ఆళ్ళ)
హైదరాబాద్​.
99853 98889
అమ్మకో రోజా!!!