కరోనా నీకో.. నమస్కారం

కరోనా నీకో.. నమస్కారం
Image by Gerd Altmann from Pixabay 

నమస్కారం పెట్టడం
మన సంస్కారం అన్నది మరచిపోయి
షేక్ హ్యాండ్, హగ్గింగ్ లకు
అలవాటు పడిన మాకు
మంచి పాఠమే నేర్పించావు
కరోనా నీకో నమస్కారం

అమ్మ చేతి కమ్మని
వంట మానేసి
స్విగ్గి లు, జొమాటోలంటూ
పిజ్జా లకు, బర్గర్ లకు
ఎగబడిన మాకు
మంచి పాఠమే నేర్పించావు
కరోనా నీకు నమస్కారం 

ఇంట్లోకి అడుగు పెట్టే ముందు
శుభ్రంగా కాళ్లు చేతులు
కడుక్కోవాలి అన్న పెద్దల మాట
చాదస్తం అంటూ
కొట్టి పారేసిన మాకు
పాత అలవాట్లు గుర్తు చేశావు
కరోనా నీకో నమస్కారం

సినిమాలు, షికార్లు అంటూ
ఇంటి పట్టున ఉండకూడా
తిరిగే మాకు లాక్ డౌన్ తో
కుటుంబ సభ్యులంతా
కలిసి ఉండేలా చేశావు
కరోనా నీకో నమస్కారం

వీధుల్లోకి వచ్చి ధర్నాలు,
రాస్తారోకోలు చేసి
మా హక్కులు సాధించుకోవడం
తెలిసి మాకు గడిపే దాటకుండా
ప్రాణాలు దక్కించుకుకోవడం కూడా
తెలుసన్న విషయం మరిచావు
వచ్చిన దారిలోనే వెనుతిరిగి పో..
కరోనా నీకో నమస్కారం.

కరోనా నీకో.. నమస్కారం
వి.యశోద,
హైదరాబాద్​
83329 95427