విరాళం @ కోటి రూపాయలు


  • కరోనా వైరస్​ నియంత్రణకు సాయం
  • ఇండియన్​ ఇమ్యునోలాజికల్స్​ లిమిటెడ్​ ప్రకటన
  • సీఎం కేసీఆర్​కు చెక్కు అందజేత

విరాళం @ కోటి రూపాయలు
సీఎం కేసీఆర్​కు చెక్కును అందజేస్తున్న కంపెనీ ప్రతినిధులు

కరోనా వైరస్​ నియంత్రణలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో  ముఖ్యమంత్రి సహాయనిధికి తమవంతు సాయంగా ఇండియన్​ ఇమ్యునోలాజికల్స్​ లిమిటెడ్​ రూ.కోటి విరాళాన్ని ప్రకటించింది. ప్రగతిభవన్​లో తెలంగాణ సీఎం కేసీఆర్​కు కంపెనీ ఎండీ డాక్టర్​  కె. ఆనంద్ కుమార్, డిప్యూటీ ఎండి  ప్రసన్న దేశ్ పాండే, వైస్ ప్రెసిడెంట్  ముత్తయ్య, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్  సత్యవాణి, అడ్మినిస్ట్రేటివ్ హెడ్  కామేశ్వర్ రావులు చెక్కును అందజేశారు.  ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​ మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందులను గుర్తించి విరాళాన్ని అందించినందుకు కంపెనీ ప్రతినిధులను అభినందించారు.