ప్రియురాలి తలపు

ప్రియురాలి తలపు
Image by Efes Kitap from Pixabay 


పల్లవి : 

నీవే ద్యానం, నీవే దైవం!
నీవే ప్రాణం, నీవే మోహం!

ఆకు కదిలినా,
చిగురాకు మెదిలినా, 
గాలి కదిపినా,
కాంతి వెదికినా...
నీ ఊహే ప్రియా!
నీ ధ్యాసే ప్రియా!

చరణం 1 : 

నీవే యుక్తి, నీవే ముక్తి,
నీవే భుక్తి! నీవే శక్తి!
సర్వం నీవే! శాంతం నీవే! నీవే నీవే! 
నేనే నువ్వు నువ్వే నేను!
నాలో నువ్వు, నీలో నేను!
ఇద్దరమొకటై, ఇలలో ఒకటై....
లలలా లలలా లలలా
లలలా సాగేపోదాం!
అలలా కలలా
ఇలలో అలలా లలలా
లలలా లలలా లలలా
కలిసే పోదాం! కరిగే పోదాం!
ఇలలో అలలా, అలలో ఇలలా!

చరణం 2 : 

కాకి కోకి కోకి కాకి
అన్నం సున్నం అల్లం బెల్లం 
చుకుక్ చుక్కు చమక్ చెక్కు
కారం కారం సూరే కారం!
ఆటలు అన్నీ పాటలు
అన్నీ నువ్వేనువ్వే! నువ్వే నువ్వే!
బాల్యం నువ్వే! భావం నువ్వే!
అడుగూ నువ్వే బుడుగూ నువ్వే!
రాధా నువ్వే! బాధా నువ్వే!
నీవే కావ్యం, నీవే భావ్యం!
నీవే సొంతం, నీవే మొత్తం,
ప్రేమా నువ్వే! విరహం నువ్వే!

చరణం 3 : 

కాళ్ళా గజ్జా కంకాళమ్మా
వేగూ చుక్కా వెలగా మొగ్గా
పుట్లో పాము గూట్లో చిలుకా..
గప్ చుప్ గప్ చుప్ దొంగలు గప్ చుప్!
బాల్యం నీవే భావం నీవే! 
పాటా నీవే పల్లవి నీవే!
రాగం నీవే తాళం నీవే-
అలలో ఇలలా ఇలలో కలలా
కలిసే పోదాం, కరిగే పోదాం!
స్వర్గం మనదే సౌఖ్యం మనదే!
రారా రారా ఎంకీ నీవే! కిన్నెర నీవే!
రారా రారా కలిసే పోదాం! కరిగే పోదాం!

     
ప్రియురాలి తలపు
 శ్రీనివాస రాజు పెన్మెత్స 
 9550 981 531