పోలీసుల ఔదార్యం..


  • 200 మంది వలస కార్మికులకు సరుకులు అందజేత
  • రాచకొండ సీపీ మహేష్​ భగవత్​
  • కింగ్స్​ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను ప్రశంసించిన సీపీ

పోలీసుల ఔదార్యం..
వలస కార్మికులను సరుకులను అందజేస్తున్న సీపీ

లాక్​డౌన్​ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పనుల్లేక పస్తులుంటున్నారు.  సరూర్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో సుమారు 200 మంది వలస కార్మికులు తిండి కోసం ఇబ్బందులు పడుతున్నారు.  ఈ విషయం రాచకొండ సీపీ మహేష్​ భగవత్​కు తెలిసింది. వెంటనే కింగ్స్​ సంస్థల ప్రతినిధులను సంప్రదించడంతో సానుకూలంగా స్పందించారు. వారి సహకారంతో వలస కార్మికులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మహేష్ భగవత్​ మాట్లాడుతూ.. ఆపద సమయంలో వలస కార్మికులకు అండగా నిలిచిన కింగ్స్​ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులను ప్రశంసించారు.  వలస కార్మికులకు పోలీసుల అండ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్​ డీసీపీ సన్​ప్రీత్​సింగ్​, ఏసీపీ పృథ్వీధర్​రావు, ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి, సిబ్బంది, సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.