పాజిటివ్

పాజిటివ్_ harshanews.com
పాజిటివ్

కరోనా నీవు పాజిటివ్ !
బలపడిన తాత మనవళ్ల బంధం !
పెరిగెను కుటుంబ సభ్యులతో అనుబంధం !!

కరోనా నీవు పాజిటివ్ !
పర్యావరణ రక్షణకు పడుచుంటిమెన్నో పాట్లు !
లాక్ డౌన్ లో పూడ్చితివిగదా ఓజోన్ పొర తూట్లు !!
                              
కరోనా నీవు పాజిటివ్ !
అయినది పవిత్ర గంగానది శుద్ధి !
ఇకనయినా మారేనా మనిషి బుద్ది !!

కరోనా నీవు పాజిటివ్ !
ఛిద్రమయిన వలసల బతుకుపై అందరి దృష్టి !
అందుకే తాయిలాలతో ప్యాకేజీల సృష్టి !!
    
కరోనా నీవు పాజిటివ్ !
సినీ హీరోలే వెండితెర వేల్పులు !
ప్రతి నాయకులయ్యెను నేడు పేదల ఇలవేల్పులు!!

కరోనా నీవు పాజిటివ్ !
కరోనా యుద్ధంలో సిపాయి అయిన ఓ సపాయి !
నేడయినవు  నీవందరి కంటి పాపాయి !!

కరోనా నీవు పాజిటివ్ !
ఖాకీలకు పర్యాయపదం కాదు కాఠిన్యం !
కోవిద్ కదనం లో కనిపించిన వారి కారుణ్యం !!

కరోనా నీవు పాజిటివ్ !
రోగుల సేవలో రేయింబవళ్లు !
డాక్టర్లు మరిచిరి వారి సొంత గూళ్ళు !!

కరోనా నీవు పాజిటివ్ !
మారుతున్న మానవ జీవన గమనం !
మరో నూతన శకం ఆగమనం !!

కరోనా నీవు పాజిటివ్ !
విపత్కర కాలంలో చూపించిన జాతి ఐక్యత !
కలకాలముండాలి ఈ సమైక్యత !

పాజిటివ్
వోరుగంటి శ్రీ వెంకటేష్ బాబు
ఎం.ఏ., ఎం.ఫిల్., (పి.హెచ్ డి).,
డాబాల బజార్, ఖమ్మం
98497 40116