‘ఆకాశ్ ఎడ్యుకేషన్’మరో ముందడుగు..


  • ఢిల్లీ పబ్లిక్ స్కూల్, బిరాట్ నగర్, నేపాల్​తో డిస్టెన్స్​ లెర్నింగ్ ప్రోగ్రాం 
  • విద్యార్థుల భవిష్యత్​ కోసం టైఅప్​
  • ‘ఆకాష్’ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రాం హెడ్​ చంద్ర శేఖర్ మిశ్ర

‘ఆకాశ్ ఎడ్యుకేషన్’మరో ముందడుగు..
‘ఆకాశ్ ఎడ్యుకేషన్’మరో ముందడుగు..

విద్యార్థుల భవిష్యత్​ను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, బిరాట్ నగర్, నేపాల్​తో డిస్టెన్స్​ లెర్నింగ్ ప్రోగ్రాంకు టైఅప్​ అయినట్లు  ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లిమిటెడ్  డిస్టాన్స్ లెర్నింగ్ ప్రోగ్రాం హెడ్​ చంద్ర శేఖర్ మిశ్ర తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎఇఎస్ఎల్  కాంపిటీటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు , స్టడీ మెటీరియల్ సహాయం అందజేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జెఇఇ మెయిన్, జెఇఇ అడ్వాస్డ్ , ఎన్ఇఇటి పరీక్షలకు సిధ్దం అవుతున్న విద్యార్థుల స్కిల్ సెట్స్ ఇంప్రూవ్ అవుతాయని తెలిపారు. ఎడ్యుకేషన్ ల్యాండ్ స్కేప్ విస్తరణకు సహకరిస్తూ,   డిపిఎస్ బిరాట్ నగర్ విద్యార్థులకు తమ పెర్ఫార్మన్స్ మెరుగుపర్చుకునేందుకు అత్యుత్తమ వేదికను అందజేసే దిశలో భవిష్యత్తు వైపు చూస్తున్నామని స్పష్టం చేశారు.

ఢిల్లీ పబ్లిక్ స్కూల్, బిరాట్ నగర్, నేపాల్ ప్రిన్సిపాల్ పర్షురామ్​ ఘిమైర్ మాట్లాడుతూ..  విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుటకు, వారు ఎన్.ఇ.ఇ.టి, జెఇఇ , బిట్సాట్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ప్రవేశానికి టైఅప్​ ఎంతగానో తోడ్పాటును అందిస్తుందన్నారు.  స్కూల్ బోర్డ్స్ , ఎన్.టి.ఎస్.ఇ,  కె.వి.పి.వై, ఒలింపియాడ్స్ వంటి జూనియర్ కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ చేయుటకు  ఎఇఎస్ఎల్ ద్వారా రూపొందించిన టీచింగ్ లెర్నింగ్ విధానాలు ఉపయోగపడుతాయని తెలిపారు.