అన్వేషణ..

అన్వేషణ..
Image by Quốc Huy Dương from Pixabay 

బాధ వినేవారంతా 
బంధువులే నాకు..
ఆదుకొనే వారంతా
ఆప్తులే నాకు..
హితం చెప్పే వారంతా 
సన్నిహితులే నాకు..
మంచి చేసే వారంతా 
మహాత్ములే నాకు..

క్షమించే వారంతా 
కావలసిన వారే నాకు..
సాయం చేసే వారంతా 
స్నేహితులే నాకు..
పరోపకారం చేసే వారంతా 
పరమాత్ములే నాకు..
కరోనా కాలంలో .. 
కలి యుగంలో..
వెతుకుతున్నా నేను..
వీరెవరైనా దొరకాలి నాకు..

          
అన్వేషణ..
 రాజా వాసిరెడ్డి నాగేంద్రకుమార్,    
ఖమ్మం.
93465 86607