ఊపిరి...

oopiri_harshanews.com
Image by Sasin Tipchai from Pixabay 

తటస్థంగా నున్న తటాకాన..
చిరుగాలి సవ్వడులకే..
అలలు రేగినట్లు..

నా జీవితాన. నీ ఆగమనం..
రేపింది.. అలజడి..

అనురాగయై ..
అక్కున చేర్చుకుంటావని..

ఆప్యాయతలతో...
అల్లుకుంటావని..

అంతరంగాన..
నీ రూపు నిలుపుకున్నాను..

నులివెచ్చని.. నీ ఊపిరులు తగిలి..
నా అధరాల అదురుతూ..
అడుగు తడబడుతూ..
అంతరంగాన అలజడుల
సవ్వడులు చెందిన..
ఊహే..నాకు ఊపిరవుతోంది..

నీ తిరస్కారాన్ని
అంగీకరించలేని
నా మది..
అంతులేని ఆవేదనలను..
అర్దంకాని అయోమయాన..
మిగిల్చింది..

ఎన్ని గాయాలైనా..
వెదురు ..వెచ్చని ఊపిరులు...
నింపగానే..
వేణువూదినట్లు..

గాయపడినా ...
నా.. మదీ...
ఎదురుచూస్తోంది..

నీ ఊపిరిని...
నా శ్వాసల లో....
నింపి... వేణుగానమవ్వాలనీ..

నా ఊపిరున్నంత ...వరకైనా..
నీ ఊహల లో...నైనా...
నను నిలుపుకోమనీ..

oopiri_harshanews.com
పోపూరి మాధవీలత
మహబూబ్​నగర్​​