విశాఖ గ్యాస్​ లీకేజీ ఘటనపై ప్రత్యేక కమిటీ


  • పలువురు ఉన్నతాధికారులతో ప్రధాని సమావేశం
  • ట్విట్టర్​లో విచారం వ్యక్తం చేసిన మోడీ

విశాఖ గ్యాస్​ లీకేజీ ఘటనపై కేంద్రం ప్రత్యేక కమిటీ
ఉన్నతాధికారులు, కేంద్రమంత్రులతో ప్రధాని మోడీ సమావేశం 
     గోపాలపట్నం పరిధి వెంకటాపురంలోని ఎల్జీ రసాయక పరిశ్రమ గ్యాస్​లీక్​ మంటల ఘటనలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. కేబినెట్​ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, పరిశ్రమల మంత్రిత్వల కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేసింది. గ్యాస్‌ లీకేజీ ఘటనపై గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ , మంత్రులు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్యాస్‌ లీకేజీ ఘటనకు దారి తీసిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం​ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదంపై కేంద్ర హోమంత్రిత్వ శాఖ, జాతీయ విపత్తు నివారణశాఖా అధికారులతో మాట్లాడానని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. గ్యాస్‌ లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ ట్విటర్‌ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, కిషన్‌ రెడ్డి, కేబినెట్‌ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, కెమికల్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.