తెలంగాణ వరం ..సురవరం

తెలంగాణ వరం ..సురవరం
తెలంగాణ వరం ..సురవరం

నిరంతర తపనతో
తెలంగాణ ఖ్యాతిని
దశదిశలా ప్రపంచానికి
చాటిన ధీరుడు
సురవరం తెలంగాణకే
ఆణిముత్యం..!

తెలంగాణవారితో
గోల్కొండ కవుల
సంచికను వెలుగులోకి
తెచ్చిన ఘనుడు
సురవరం తెలంగాణకే
గొప్పవరం ..!

తెలంగాణ భాష,
సంస్కృతికి
తెలుగు వికాసానికి
కృషి సల్పిన ధీరుడు
సురవరం నిరంతర
సాహిత్యచేతనం ..!

పత్రికలు స్థాపించిన
సంపాదకుడిగానూ
రచయితగానూ
ఖ్యాతిని పొందిన శూరుడు
సురవరం బహుముఖ
ప్రతిభాశాలి ..!

పరిశోధనా రంగంలో
పేరు గాంచి
ప్రజల కడగండ్లను
తుడిచిన నాయకుడు
సురవరం పేదల పాలిట పెన్నిధి ..!

 
తెలంగాణ వరం ..సురవరం

బండారు సునీత
మహబూబ్​నగర్​
94406 71530