ఆర్ఆర్ఎ స్ ప్రాజెక్టు అమలులో రోలింగ్ స్టాక్ బిడ్ ప్రక్రియ


  • ఎన్‌సిఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్  వినయ్ కుమార్ సింగ్
  • బొంబార్డియర్ గ్లోబల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్లో  రూపకల్పన

ఆర్ఆర్ఎ స్ ప్రాజెక్టు అమలులో రోలింగ్ స్టాక్ బిడ్ ప్రక్రియ
ఆర్ఆర్ఎ స్ ప్రాజెక్టు అమలులో రోలింగ్ స్టాక్ బిడ్ ప్రక్రియ


దేశపు మొదటి రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్ఎ స్) ప్రాజెక్టు అమలులో రోలింగ్ స్టాక్ బిడ్ ప్రక్రియను ఖరారు చేయడం ఒక ముఖ్యమైన మైలురాయి అని ఎన్‌సిఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్  వినయ్ కుమార్ సింగ్ తెలిపారు.  ఢిల్లీ-మీరట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టంకు 210 రైలు కార్లను సరఫరా చేసే కాంట్రాక్ట్ బొంబార్డియర్ సంస్థ తీసుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ఆర్ ఆర్ టిఎస్ట (RRTS) కోసం 83 శాతం స్థానికంగానే ఉండే వనరులతో,100 శాతం స్థానికంగా తయారు చేసిన తయారైన రైలు సెట్లను సరఫరా చేయడానికి బొంబార్డియర్ ట్రాన్స్ పోర్టేషన్లో మా భాగస్వామ్యం భారత ప్రభుత్వ 'మేక్ ఇన్ ఇండియా' ను బలంగా ముందుకు తీసుకుపోతుందని తెలిపారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్లో నివసించేవారి ఆకాంక్షలను జీవన నాణ్యతను మెరుగుపరచడానికి దోహద పడతాయన్నారు.

బొంబార్డియర్ ట్రాన్స్ పోర్టేషన్ ఇండియా కంట్రీ లీడర్ రాజీవ్ జోయిసర్ మాట్లాడుతూ..   ప్రజా రవాణాను విస్తరిస్తూ , దాని సమీపంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు కలుపుతున్న సందర్భంలో వేగవంతమైన రవాణా వ్యవస్థను అందించడానికి మేము ఎంపిక కావడం గర్వంగా ఉందని చెప్పారు.  నూతన రైళ్ళు  దేశంలోనే డిజైన్ చేసి నిర్మిచబడతాయని,  ప్రయాణికుల సౌకర్యాలను, భద్రత పెంచుతాయని తెలిపారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ప్రధాన 'మేక్ ఇన్ ఇండియా' మార్గదర్శకాలను వడోదరలోని బొంబార్డియర్ ఉత్పత్తి ద్వారా అమలు చేయనున్నదని చెప్పారు. హైదరాబాద్ లోని గ్లోబల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ లో రోలింగ్ స్టాక్ డిజైన్ చేయబడుతుందని  స్పష్టం చేశారు.