కరోనా నియంత్రణకు నిరంతరం కృషి


Medak SP Chandana Deepti
  • విధి నిర్వాహణలో సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి
  • మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి 
కరోనా వైరస్​ నిర్మూలించడానికి పోలీసు సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని మెదక్​ జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. లాక్​డౌన్​ నేఫథ్యంలో ప్రజలు ఇష్టానుసారంగా తిరుగుతూ పోలీసు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించవద్దని ప్రజలకు సూచించారు. కరోనా వైరస్​ ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. వ్యాప్తి చెందే విధానంపై అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ప్రజలకు  వివరిస్తున్నట్టు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి పోలీస్ శాఖ కీలకంగా పనిచేస్తుందని  విధినిర్వహణలో ఉన్న సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టుల దగ్గర వుండే సిబ్బంది ఎల్లపుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని వారు కోరారు.