బ్రిటానియా మారీ గోల్డ్ మై స్టార్ట్ అప్ సీజన్ 2 ఫినాలే

  • 10 మంది విజేతలకు నగదు పురస్కారం
  • ఒక్కొక్క విజేతకు రూ. 10లక్షలు
  • బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గుంజన్ షా 
బ్రిటానియా మారీ గోల్డ్ మై స్టార్ట్ అప్ సీజన్ 2 ఫినాలే
బ్రిటానియా మారీ గోల్డ్ మై స్టార్ట్ అప్ సీజన్ 2 ఫినాలేబ్రిటానియా మారీ గోల్డ్​ మై స్టార్ట్​ అప్​ సీజన్​‌‌‌‌–2 ఫినాలేలో 10 మంది విజేతలను ప్రకటించారు. ఒక్కొక్క విజేతకు 10 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గుంజన్ షా మాట్లాడుతూ..  బ్రిటానియా మారీ గోల్డ్ మై స్టార్ట్ అప్ సీజన్ 2 ఫినాలేతో పది మంది కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కానున్నా యని తెలిపారు  బ్రిటానియా మారీ గోల్డ్ మై స్టార్టప్ అనేది ఔత్సాహిక గృహిణుల్లోని వ్యాపార దక్షతను ప్రోత్సహించి, ఆర్థిక స్వేచ్ఛతో వారు తమ కలలను సాకారం చేసుకునేందుకు, తమను తాము ఉద్యోగ సృష్టికర్తలుగా తీర్చిదిద్దుకునేందుకు రూపొందించిన ఒక ప్రత్యేక వేదికని స్పష్టం చేశారు.  

ఆర్థిక సహకారంతో పాటు, బ్రిటానియా మేరీ గోల్డ్ మై స్టార్ట్ అప్ తాజా  ఎడిషన్ 10,000 మంది గృహిణులకు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) భాగస్వామ్యంతో భారతదేశంలో మొట్టమొదటి సారిగా ఆన్‌లైన్‌లో వారి అవసరాలకోసమే ప్రత్యేకంగా రూపొందించిన నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకు వస్తోందని చెప్పారు. ఈ ఆన్‌లైన్ కోర్సు గృహిణులు తమ సొంతకాళ్లతో నిలబడి, భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేస్తున్నప్పుడు వారికి కావలసిన వ్యాపార దక్షత నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు కావలసిన ఆత్మ విశ్వాసాన్ని అందిస్తుందన్నారు. 

నైపుణ్య అభివృద్ధి శిక్షణ పొందిన గృహిణుల్లో చాలామంది వ్యాపారవేత్తలుగా రూపుదిద్దుకుంటారని బ్రిటానియా విశ్వసిస్తోందని తెలిపారు. ఫిబ్రవరి 2020లో ప్రారంభమైన 2వ ఎడిషన్‌కు గత 3 నెలల్లో దేశంలోని 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అనూహ్య స్పందన లభించిందని,  వివిధ ప్రాంతాల నుంచి 1.5 మిలియన్ల పైచిలుకు దరఖాస్తులను అందుకుందని తెలిపారు.. లక్షలాది దరఖాస్తులు వచ్చిన తరువాత బయటి వ్యక్తులతో రూపొందించిన న్యాయ నిర్ణేతల బృందం తదుపరి వారాల్లో సుదీర్ఘ చర్చల అనంతరం బ్రిటానియా మారీ గోల్డ్ టీమ్ 50 మంది ఫైనలిస్టులను ఎంపిక చేసిందని చెప్పారు. 

బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెటింగ్ హెడ్ వినయ్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. మా అవార్డును గెల్చుకుని పారిశ్రామికవేత్తలుగా వ్యాపారాలను ప్రారంభించనున్న  గృహిణులు తమ చుట్టూ ఉన్న ప్రపంచంలో పలువురి జీవితాల్లో మార్పు తీసుకు వచ్చే ఉద్యోగ సృష్టికర్తలుగా మారతారని చెప్పారు. ఒక విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్త చాలా మందికి విస్తృత అవకాశాల తలుపులను తెరుస్తారని నిరుటి విజేతలు నిరూపించారని, ఈ ప్రయత్నం ద్వారా, మేము వ్యాపార ప్రపంచానికి మరో 10 మంది గృహిణులను పరిచయం చేస్తున్నామని, 10,000 మంది గృహిణులకు వారి వ్యాపార ప్రయాణానికి కౌశల్యాభివృద్ధి శిక్షణతో శక్తిని అందించేందుకు మేము సంతోషిస్తున్నారు. 

మహిళలు స్వావలంబనతో, ఆర్థికంగా స్వతంత్రంగా మారినప్పుడు, మొత్తం కుటుంబాలు, సమాజాలతో పాటు దేశం అభివృద్ధి చెందుతుందని మేము దృఢంగా విశ్వసిస్తున్నామని తెలిపారు. మై మారీ గోల్డ్, మై స్టార్టప్ అవార్డ్స్ దేశ వ్యాప్తంగా వ్యాపార దక్షత ఉన్న మహిళలకు పురస్కారాలను అందజేస్తోందని చెప్పారు.

Post a Comment

0 Comments