250 ఇన్​ఫ్రారెడ్​ థెర్మోమీటర్ల విరాళం


  • ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించాలి
  • వివేకానందరెడ్డి కూతురు డా.సునీత నర్రెడ్డి 

250 ఇన్​ఫ్రారెడ్​ థెర్మోమీటర్ల విరాళం_harshanews.com
కలెక్టర్​కు థెర్మోమీటర్లను అందజేస్తున్న డా. సునీత నర్రెడ్డి

హైదరాబాద్​:  కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో రోగుల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించేందుకు థెర్మోమీటర్లు సహాయపడనున్నట్లు వైఎస్​ వివేకానందరెడ్డి కూతురు, అపోలో హాస్పిటల్స్​ కోవిడ్​యూనిట్​హెడ్ డా. సునీత నర్రెడ్డి తెలిపారు. హైదరాబాద్​ జిల్లా కలెక్టర్​ డా. శ్వేతా మొహంతి, జిల్లా వైద్యాధికారి డా. వెంకటేశ్వరరావులకు 250 ఇన్​ఫ్రారెడ్​థెర్మోమీటర్లను ఆమె భర్త రాజశేఖర్​రెడ్డితో కలిసి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా డా.సునీత నర్రెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో కార్యాలయాలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలతో కలిపి అన్ని ప్రభుత్వ వ్యవస్థలలో ఆరోగ్య పరీక్షలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్న సందర్భంగా వైఎస్​ వివేకానందరెడ్డి స్మృత్యర్దంగా సాయం చేశామని స్పష్టం చేశారు. ప్రజలు కరోనా బారిన పడకుండా వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు.