- కల్నల్సతీమణికి గ్రూప్1 స్థాయి ఉద్యోగం
- సంతోష్‌బాబు ఇంటికి వెళ్లి సాయమందిస్తా..
- తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
![]() |
సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ |
హైదరాబాద్: కల్నల్సంతోష్బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, కుటుంబానికి రూ.5కోట్లు అందజేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... సంతోష్ బాబు కుటుంబానికి నివాస స్థలం, ఆయన సతీమణికి గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఇదే ఘర్షణలో మరణించిన మిగతా 19 మంది కుటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరుఫున కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని సీఎం వెల్లడించారు.‘‘సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సైనికులకు యావత్ దేశం అండగా నిలవాలని, వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పారు. తద్వారా సైనికుల్లో ఆత్మ విశ్వాసం, వారి కుటుంబాల్లో భరోసా నింపాలని తెలిపారు. వీర మరణం పొందిన సైనికులకు కేంద్ర ప్రభుత్వం ఎలాగూ సాయం చేస్తుందని, కానీ రాష్ట్రాలు కూడా సహాయ సహకారాలు అందించాలని, అప్పుడే సైనికులకు, వారి కుటుంబాలకు దేశం మా వెంట నిలుస్తుందనే నమ్మకం కుదురుతుందని చెప్పారు. సింబల్ ఆఫ్ యూనిటీ ప్రదర్శించాలన్నారు.