డిస్ట్రిబ్యూటర్​ కుటుంబానికి రూ.5లక్షల సాయం


  • నల్గొండ జిల్లా ఎయిర్​టెల్​సేల్స్​ మేనేజర్​ ఆనంద్​

డిస్ట్రిబ్యూటర్​  కుటుంబానికి  రూ.5లక్షల సాయం
మృతుని తల్లికి ఆర్థికసాయాన్ని అందజేస్తున్న సేల్స్​ మేనేజర్​ ఆనంద్​

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎయిర్​టెల్​ డిస్ట్రిబ్యూటర్​  దేవిరెడ్డి మహేందర్​రెడ్డి (33) మృతి చెందాడు.  మృతుడు నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో డిస్ట్రిబ్యూటర్​గా సేవలందిస్తున్నాడు. విషయాన్ని తెలుసుకున్న నల్గొండ జిల్లా ఎయిర్​టెల్​సేల్స్​ మేనేజర్​ ఆనంద్​  మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మహేందర్​తల్లి పద్మకు 5 లక్షల రూపాయల డీడీని అందజేశారు. ఈ సందర్భంగా ఆనంద్​  మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో మహేందర్​రెడ్డి మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన మృతితో కుటుంబంలో పెద్ద దిక్కు లేకుండా పోయిందన్నారు. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఎయిర్​టెలల్​ అన్మోల్​ రత్న పథకంలో భాగంగా రూ.5లక్షల సాయాన్ని అందజేశామని తెలిపారు.