గజల్ (6-6-6-6)

 గజల్ (6-6-6-6)_harshanews.com
గజల్​ (6‌‌‌‌‌‌–6–6–6)

నీవులేని అడుగులనూ కనగలమా ? జవానుడా
గడియైనను నీవులేక మనగలమా ? జవానుడా..

వైరిదారుల సాహసాన గుండెచూపి నిలబడుతూ
కలబడితే కరుణలేని
 చెలమలమా ? జవానుడా..

గుంటనక్క సోయగాలు మట్టుబెట్ట అమరుడైన
సంతోషూ' నీఊహను విడగలమా ? జవానుడా..

దేశమాత ఒడిచేరిన తెలంగాణ ముద్దుబిడ్డ
నీయశమును కలనైనా మరువగలమా ? జవానుడా..

సీతమ్మల కన్నీళ్లు స్వదేశీ నినాదాలు
చైనాసరుకు ఇకమీదట కొనగలమా ? (లేము) జవానుడా..

అమరవీరులకు గజల్ రూప అక్షరాంజలి సమర్పిస్తూ...

     
 గజల్ (6-6-6-6)_harshanews.com
సోంపాక సీత
భద్రాచలం
86393 11050