కూరగాయలు,పండ్ల పరిశుభ్రతకు ‘నీమ్​వాష్​’


  • సరికొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టిన ఐటిసి
  • వినియోగదారుల శ్రేయస్సే ముఖ్యం
  • బిజినెస్‌ డివిజన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సమీర్‌ సత్పతి

Nimwash_harshanews.com
 కూరగాయలు,పండ్ల పరిశుభ్రతకు ‘నీమ్​వాష్​’


కూరగాయలు, పండ్లను పరిశుభ్రం చేసేందుకు నీమ్​వాష్​ను మార్కెట్​లోకి ప్రవేశపెట్టినట్లు ఐటిసి లిమిటెడ్‌, పర్సనల్‌ కేర్‌ ప్రాడక్ట్స్‌ బిజినెస్‌ డివిజన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సమీర్‌ సత్పతి తెలిపారు. మార్కెట్​లోకి ప్రవేశపెట్టిన సందర్భంగా వారు మాట్లాడుతూ... సహజసిద్ధమైన నీమ్​వాష్​ను వినియోగదారులకు అందించేందుకు నూతన ఉత్పత్తిని తీసుకొచ్చామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌పై అవగాహన కలిగిన ప్రతి ఒక్క వినియోగదారుడు తన జీవనశైలిలోని ప్రతి అంశంలో పరిశుభ్రతను ఆచరిస్తున్నారని తెలిపారు.  క్లిష్ట పరిస్థితులో వినియోగదారుకు సహాయపడే రీతిలో,  వారి  అవసరాన్ని గుర్తించి సేవ చేయాలన్నదే మా ప్రయత్నం అని స్పష్టం చేశారు. వేప , సిట్రస్‌ పండ్ల తో  ఐటిసి నీమ్‌ వాష్‌ వెజిటబుల్‌,  ఫ్రూట్‌ వాష్‌ ప్రత్యేకంగా  రూపొందించామన్నారు.  క్లోరిన్‌, బ్లీచ్‌, కృత్రిమ రంగులాటివి ఇందులో వినియోగించలేదని, వినియోగదారుల శ్రేయస్సే ముఖ్యమని తెలిపారు. మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా ధరలను నిర్ణయించామని, 500 ఎంఎల్​, లీటర్​ ప్యాక్​లలో అందుబాటులో నీమ్​వాష్​ ఉందని తెలిపారు.