మా నాన్నే..మా హీరో

మా నాన్నే..మా హీరో
మా నాన్నే..మా హీరో
మొగ్గలు 

మన బ్రతుకులకు వెన్నెముకై
జీవితాలను నిలబెడతాడు
మన బతుకులకు దీవెన నాన్న!

జీవితంలో తప్పటడుగు లేయకుండా
చిటికెనవేలితో దారిచూపిస్తుంటాడు
పిల్లలకు బతుకుఊతం నాన్న!

మండుటెండల్లో చల్లనినీడలా
సేదతీర్చి చింత తీరుస్తాడు
కుటుంబానికి బతుకుభరోసా నాన్న!

కళ్ళలోని భావాన్ని అర్థం చేసుకుని
పిల్లలందరికీ కడుపు నింపుతాడు
మన బతుకులకు బాసట నాన్న!

మనం బాధ పడుతుంటే చూసి
అతను కన్నీళ్లు కారుస్తాడు
మనఆత్మలా వెన్నంటిఉండేది నాన్న !

క్షణక్షణం బాధ్యతలను గుర్తుచేస్తూ
బతుకుపోరాటంలో శిక్షణ ఇస్తాడు
మాకందరికీ గొప్ప గురువు నాన్న !

పిల్లల ఎదుగుదలను చూస్తూనే
తనలో తాను మురిసిపోతుంటాడు
ఎప్పుడూ అల్పసంతోషి నాన్న !

ఆర్థికంగా చితికిన కూడా
మన బతుకు కొరకు శ్రమిస్తాడు
కుటుంబానికి గొప్పపోషకుడు నాన్న!
......................................................................................................
         
          రవి చంచల
           85003 30700