బతుకుబాట.. తోలుబొమ్మలాట

బతుకుబాట..తోలుబొమ్మలాట_harshanews.com
బతుకుబాట..తోలుబొమ్మలాట 

జీవంలేని బొమ్మలతో
జీవకళ ఉట్టిపడేలా
ప్రదర్శించే ఆట !
పల్లెవాసులకు వినోదాన్ని
పంచి పెట్టే ప్రాచీన కళ !

జంతువుల తోలుతో
బొమ్మలు చేసి ప్రదర్శించు
సామూహిక సంగీత నాట్య
ప్రదర్శన కళ .. తోలుబొమ్మలాట !

పాల్కురికి సోమన కాలంలో
రంగనాథ రామాయణంలో
ప్రశస్తిగల పురాణ కళ !

సన్నని వస్త్రం తెరగా కట్టి
దివిటీలు వెలిగించి
బొమ్మల కాళ్ళకు చేతులకు
దారాలు లాగుతూ
చూపించే అందమైన కళ!

జుట్టుపోలిగాడు బంగారక్క
హాస్య పాత్రలు గల కళ !

జనుల ఆనందానికే కాక
వర్షాలు పడడానికి కూడా
ప్రదర్శించే ఈ కళ ..
ఒకనాడు అత్యున్నత స్థాయి
పొంది అలరించిన ఈ కళ ..
నేడు వెల వెలబోయే
పరిస్థితి ఎదురయ్యింది !

కలకలలాడి కనుమరుగవుతున్న
జానపద కళారూపాలను..ఆదరిద్దాం.
మన అస్తిత్వాన్ని కాపాడుకుందాం !!
బతుకుబాట..తోలుబొమ్మలాట_harshanews.com
బండారు సునీత
మహబూబ్​నగర్​
94406 71530