ఎక్కడ నీ చిరునామా

ఎక్కడ నీ చిరునామా_harshanews.com
ఎక్కడ నీ చిరునామా 

సామాజిక బాధ్యత...
ఎక్కడ నీ చిరునామా
సామాజిక దూరం పాటించుట !
అంటే మన సామాజిక బాధ్యత నిర్వహించుట !!

సామాజిక బాధ్యత...
ఎక్కడ నీ చిరునామా
కరోనా కరాళ నృత్యం చేస్తున్నవేళ !
ఇది మానవ నిర్లక్ష్యపు హేల !!

సామాజిక బాధ్యత...
ఎక్కడ నీ చిరునామా
అగుపించదు అంగళ్లలో !
కనిపించదు కూడళ్లలో !!

సామాజిక బాధ్యత...
ఎక్కడ నీ చిరునామా
బారుల్లో లేదు !
బస్టాండుల్లో అసలే లేదు !!

సామాజిక బాధ్యత...
ఎక్కడ నీ చిరునామా
ఖాళీ వృత్తాలు చతురస్రాలు అన్నిచోట్లా దర్శనం !
వాటి నిరూపయోగమే ఇందుకు నిదర్శనం !!

సామాజిక బాధ్యత...
ఎక్కడ నీ చిరునామా
ముఖాలకు తొడగని ముసుగులు !
ఇవి కరోనాకి మనమందించే లొసుగులు !!

సామాజిక బాధ్యత...
ఎక్కడ నీ చిరునామా
చేతుల పరిశుభ్రత పై లేని పట్టింపు !
అందుకే అవుతున్నాఏమో ? పాజిటివ్ కేసులరెట్టింపు !!


సామాజిక బాధ్యత...
ఎక్కడ నీ చిరునామా
తరతమ భేదం లేకుండా అంతా కలివిడి !
పాజిటీవ్ అని తేలితే మందుల పిచికారితో హడావిడి !!

సామాజిక బాధ్యత...
ఎక్కడ నీ చిరునామా
జాగ్రత్తలు పాటించుట విజ్ఞత !
అపుడే అందరి జీవితాలకు భద్రత !!

సందర్భం:- 
లాక్ డౌన్ తీసేసిన ఈ తరుణంలో 
ప్రస్తుతం  సంపూర్ణంగా కనిపించని 
సామాజిక బాధ్యత

======================================================
ఎక్కడ నీ చిరునామా_harshanews.com
వోరుగంటి శ్రీ వెంకటేష్ బాబు
             ఎం.ఏ., ఎం.ఫిల్., (పి.హెచ్ డి )
ఖమ్మం
9849740116