సమిదౌతున్న.. బాల్యం

samidavthunna baalyam_harshanews.com
Image by billy cedeno from Pixabay 

సరదాగా  ఆట పాటలతో
జీవితాన్ని గడపాల్సిన బాలలు
బాల్య వివాహాల రూపంలో
బలై పోతూనే ఉన్నారు !

లేత ప్రాయంలోనే  పెళ్లిళ్లు చేసి
చేతులు దులుపుకుంటున్న
తల్లిదండ్రులు ..

చిన్నారుల జీవితాన్ని
చెదలు పట్టిస్తున్నారు !

అత్తవారింట్లో అడుగుపెట్టిన
అమాయకపు  అమ్మాయిలు
ప్రమాదాలు  ఏ వైపు నుంచి
ఎప్పుడు ముంచుకొస్తాయోనని
బిక్కుబిక్కుమంటూ
భయంతో ఆగమై
పోతూనే ఉన్నారు !

నరసర్పాల పడగ నీడలో
భావి పౌరుల బాల్యమంతా
విషపు కాటుకు బలైపోతుంటే
టీవీల్లో పేపర్లో సోషల్ మీడియాలో
సొల్లు కబుర్లతో పబ్బం గడుపుతున్న
సోయిలేని నాయకులు
అధికార పెద్దలు బంధీలో బలైపోతున్న
బాల్యాన్ని రక్షించలేరా ?
ఇంకెన్నాళ్లీ..మూఢాచారాలు ?
ఇంకెన్నాళ్లీ .. ఘోరాలు ??
           

ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం

-----------------------------------------------------------------------------------
samidavthunna baalyam_harshanews.com
 సునీత బండారు
పాలమూరు
94406 71530