తలపుల తరంగం

తలపుల తరంగం
తలపుల తరంగం

వేకువపువ్వులా 
నీ చూపుల తాకిడి
నను వెంటాడగా..

కాలిమువ్వలా..
నీ మాటల ఒరవడి 
వీనులవిందు కాగా...

మౌనగీతిలా..
నీ తలపులరవళులు
మదిదోచగా..

నింగిలో విరిసిన 
సప్తవర్ణ హరివిల్లు వలె
మనసు హాయిగొల్పు పరవశమై

వెండి మబ్బులు 
నీలిగగనంలో ఊయల ఊగిన చందంగా
నీ జతలో నాకు సంతోషాల లాలిపాటలేగా...

పవిత్రమైన మానస సరోవరంలా..
నీ మానసమెంత తెలుపుదనమో..

గూటిలోని గువ్వపిల్లలా
నిను చూసిన తరుణం
చూసాను కొత్తలోకం

శ్రావ్యమైన పాటలోని 
సంగీతసాహిత్యంలా..
ఇరు హృదయాల కలయిక 
తన్మయత్వ సోయగమేగా..

..........................................
  గీతాశ్రీ స్వర్గం
     మెదక్