రాష్ట్రం ఏర్పడ్డాకే.. సమస్యల పరిష్కారం


  • దేశంలో అగ్రగామిగా వ్యవసాయం
  • ప్రజలకు రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు
  • తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్​రావు
  • అమరవీరుల స్థూపం వద్ద నివాళులు


రాష్ట్రం ఏర్పాడ్డాకే.. సమస్యల పరిష్కారం_harshanews.com
తెలంగాణ తల్లి చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న సీఎం

రాష్ట్రం ఏర్పాడ్డాకే.. సమస్యల పరిష్కారం_harshanews.com
అమరుల స్థూపానికి నివాళులు

రాష్ట్రం ఏర్పడిన తరువాతనే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్​రావు స్పష్టం చేశారు. మంగళవారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్​పార్క్​ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం ప్రగతి భవన్​లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడే నాటికి రైతుల పరిస్థితి, వ్యవసాయం పరిస్థితి దారుణంగా ఉండేదని, నేడు తెలంగాణ వ్యవసాయం దేశంలేనో అగ్రగామిగా ఉందని సీఎం అన్నారు. ఎండాకాలం వస్తే ప్రజలు మంచినీళ్ల కోసం గోస పడేవారని, నేడు మిషన్ భగీరథతో ఆ సమస్య పరిష్కారం అయిందన్నారు. విద్యుత్, సాగునీరు, విద్య, వైద్య, పారిశ్రామిక, ఐటి తదితర రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రయాణం అనుకున్న రీతిలో ఎంతో ఆశావహంగా ప్రారంభమైందన్నారు. ఈ సందర్భంగా  తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాటు పడడం కోసం ప్రభుత్వం పునరంకితం అవుతుందన్నారు. ఈకార్యక్రమంలో  రాజ్యసభ సభ్యులు  కె.కేశవరావు,  జె.సంతోష్ కుమార్,  కె.ఆర్. సురేశ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు  రాజీవ్ శర్మ,  అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్, డిజిపి  మహేందర్ రెడ్డి, ఎసిబి డిజి  పూర్ణచందర్ రావు, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫజీయుద్దీన్, ఎమ్మెల్యేలు  జీవన్ రెడ్డి, నాగేందర్,  ఆత్రం సక్కు, రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, కార్పొరేషన్ల చైర్మన్లు  గ్యాదరి బాలమల్లు,  మారెడ్డి శ్రీనివాసరెడ్డి, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు.