జై జవాన్ మేరా భారత్ మహాన్

జై జవాన్ మేరా భారత్  మహాన్_harshanews.com
జై జవాన్ మేరా భారత్  మహాన్

తెల్లని మంచుకొండల్లో
నెత్తుటి వరదలు..
నిర్మల.. హిమాలయాల్లో..
కుట్రల నిప్పు రాజేసి 
దొంగ దెబ్బ తీసి చీ చీ 
అనిపించుకున్న చీనీయులు..


తెలంగాణా పోరుబిడ్డ
సూర్యాపేట సూరీడు
సంతోష బాబు..
నీ త్యాగానికి ప్రతి తెలుగోడి గుండె
చెరువైంది ,ప్రతి కన్నపేగు  తల్లడిల్లింది..
కన్నీరు..అలలా మమ్ము ముంచెత్తింది..
మా హృది మందిరం లో.. కొలువైయ్యావు ..

ఎంతటి పుణ్యం చేసుకున్నదొ
నిన్ను కన్న పురిటిగడ్డ..
ఎంతటి భాగ్యం చేసుకున్నదో
నీవు నడయాడిన ఈ నేల..

కనురెప్పల పహారాలా
దేశానికి   గస్తీలు కాస్థున్నవి
కన్నవారు
కట్టుకున్నవారు..
కడుపుల పుట్టిన వారి
రూపాలు చూడాలని ఉన్నా..
చూడలేని నిస్స హాయత.. 

ప్రతి ఇంట్లో వేడుకకు మీరే కారణం
మీ ఆత్మ త్యాగాలు అనన్యసామాన్యం
మీ బలిదానాలు అద్వితీయం..

మీ భరోసా తోనే మా బతుకులు..
అడుగడుగునా మట్టి కరుస్తూ.. శతృవులను
మట్టి కరిపిస్తు మాకు ప్రహరీ గోడ లా నిలుస్తారు .
మీ రక్తం ఏరులై పారించి
మా ప్రాణం నిలుపుతారు..

ఆ తల్లి గుండె ధైర్యానికి
ఆ ఇల్లాలి దైవత్వానికి
ఆ జవాన్ త్యాగానికి
నిఘంటువు లో పదాలు లేవు..
వర్ణమాల లో అక్షరాలు సరిపోవు..
భాష సరిపోదు..
మా గుండె గుడిలో ఇలవేల్పు గా
నిలిపి కన్నీటి తో అభిషేకించడం తప్ప
ఏమీ చేయలేని నిస్సహాయులం

మీ సేవలకు మా అణువణువు మీ ముందు మోకరిల్లుతుంది..
మీ త్యాగానికి పంచభూతాలు సైతం అబ్భురపడుతాయి..

కలం లో కన్నీటి సిరా తో రాసే మా అక్షర నీరాజనం ఇది.

.........................................................
మాధవి శ్రీనివాస్ నందిమళ్ళ
హైదరాబాద్.