నేస్తానికి అంకితం..

నేస్తానికి అంకితం.._harshanews.com
నేస్తానికి అంకితం..


గులాబీలా పరిమళ భాషలా 
మౌనంగా మాట్లాడే ఓ నేస్తమా !

అప్పుడే లేచిన లేడికి
ఉన్న హుషారును
తలపింప జేసే ఓ  స్నేహమా!

మేఘమాల మెరుపు లాంటి
నీ మెరుపు చూసి పరవశించింది
ఆ నీలాకాశం !

ఉధయభానుడి ఉషస్సు లాంటి
నీ నవ్వు చూసి . . .
సెలయేటి లోని
ఆ 'కమలం 'కలవర పడి పొయింది !

గంభీరమైన 'సాగరం' లాంటి
నీ  'వ్యక్తిత్వం ' చూసి
సంబర పడింది
ఆ ' సంధ్రం 'ఉన్నతంగా
నిలబడిన గిరి లాంటి
నీ  'ధైర్యానికి ' అబ్బుర పడింది
ఆ నీలి పర్వతం

అన్నింటా నీ ఔన్నత్యం నన్ను
 ముగ్ధురాలిని   చేస్తుంటే
' పారిజాత 'మంటి నీకు
ఏమి ' అంకితమివ్వను,
చెలీ! గడ్డిపువ్వు లాంటి నా
కవితా పుష్పాన్ని తప్ప . .

.............................................................................................................
  
మాధవి  శ్రీనివాస్ నందిమళ్ల
హైదరాబాద్