సలాం .. అమరవీరా

salaam.. amaraveera_harshanews.com
సలాం .. అమరవీరా  

ఎడారుల్లో ..
మంచుకొండల్లో
నిద్రాహారాలు
మానుకుని
దేశ భద్రతను
పరిరక్షిస్తూ
సరిహద్దుల వద్ద
కాపలా కాస్తున్న
భారత సైనికా..
మీకు వందనం !

శత్రు దేశ సైన్యానికి
ఏ మాత్రం
అవకాశమివ్వకుండా ..
డేగ  కళ్ళతో
పహారా కాస్తుంటే
నియంత్రణ రేఖ
సరిహద్దుల్లో
దొంగ దెబ్బ తీసిన
చైనా ముష్కరుల పై
ఎదురొడ్డి నిలిచి
దాడి చేసి
మట్టికరిపించిన ..
భారత సైనికా..
మీకు వందనం !

చైనా మూకలు 
జరిపిన ..
మెరుపు దాడులకు
బదులుగా ..
సింహాలై గర్జిస్తూ
చిరుతలా కదులుతూ
గాల్వాన్ లోయలో
విషం చిమ్మిన
చైనా డ్రాగన్ల
బుసకొట్టిన పడగలపై
ఉక్కుపాదం మోపి
జయ కేతనం
ఎగుర వేసిన ..
భారత సైనికా ..
మీకు  వందనం ..!

శరీరం గడ్డకట్టే
మంచులోయల్లో
దేశం కొరకు
నెత్తుటి ధారలు
కురిపిస్తూ
అసువులు బాసిన
అమరవీరులారా ...
అభివందనం..!!

       (దేశం కొరకు ప్రాణాలు విడిచినవీర జవానులకు అక్షర నివాళులు అర్పిస్తూ .. )  
........................................................................................................................................................


సునీత బండారు
94406 71530
       ............................................................................................