ఈ సారి బోనాలు ఇంట్లోనే..


  • ఆలయాల్లో బోనాలు నిర్వహించనున్న పూజారులు
  • ప్రజలెవరూ ఆలయాలకు రాకుండా ప్రభుత్వానికి సహకరించాలి
  • మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​

ఈ సారి బోనాలు ఇంట్లోనే.._harshanews.com
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తలసాని
హైదరాబాద్​:  కరోనా నేపథ్యంలో ఈ సారి ప్రజలు బోనాలను ఇంట్లోనే నిర్వహించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ సూచించారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ, మల్లారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని  మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది ఆలయాల్లో పూజారులు మాత్రమే బోనాలు నిర్వహించనున్నారని తెలిపారు.  గటాల ఉరేగింపును పూజారులే నిర్వహిస్తారని.. అదేవిధంగా అమ్మవార్లకు పట్టువస్త్రాలు కూడా వారే సమర్పిస్తారని స్పష్టం చేశారు. ప్రజలెవరూ ఆలయాలకు రాకుండా ప్రభుత్వానికి సహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, సీపీ మహేష్‌ భగవత్‌, జీహెచ్‌ఎంసీ, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.