మాతృభాష మాధుర్యం


మాతృభాష మాధుర్యం
మాతృభాష మాధుర్యం
జ్ఞాన సాధనకు
పునాది అయిన
మాతృభాషను విడిచి
పరభాషల కొరకు
అర్రులు చాచి
మనల్ని మనమే
ముందడుగు వేయకుండా
సంకెళ్లు వేసుకొని
ముందుకు సాగుతున్నాం !

స్వశక్తి మీద
నమ్మకం కలిగించి
వ్యక్తిత్వ నిర్మాణంలో
దోహదం చేసి
వ్యవహార సామర్థ్యాన్ని
పెంపొందించి
మంచి చెడుల భేదాన్నీ
తెలియపరిచే
అమ్మ భాష అయిన
మాతృభాషని
మనం.. విస్మరిస్తున్నాం !

ఇకనైనా ఇలాంటి
భాషా దారిద్య్రానికి
చోటు ఇవ్వకుండా
స్వచ్చమైన మాతృభాషలో మాట్లాడుదాం !

అన్య భాషలను
కలిపి మాతృ భాష
ఉనికిని దూరం చేస్తున్న
వారందరికీ
అవగాహన కల్పిద్దాం !

మాతృ భాష
మాధుర్యాన్ని చాటుదాం !
మాతృభాషను కాపాడుకుందాం !!
.............................................................................................................

మాతృభాష మాధుర్యం
బండారు సునీత
మహబూబ్​నగర్​
94406 71530